Abn logo
Sep 21 2021 @ 19:56PM

IPL2021: దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్

దుబాయ్: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ దూకుడు పెంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెబుతున్నారు. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైపాల్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చెత్త బంతులను బౌండరీలకు పంపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. లూయిస్ 20 బంతుల్లో సిక్సర్, 7 ఫోర్లతో 36 పరుగులు చేయగా, జైశ్వాల్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేశాడు.