ఆ మృతదేహం రాజుదే..: వరంగల్ టౌన్ ఏసీపీ

ABN , First Publish Date - 2021-09-16T22:44:44+05:30 IST

వరంగల్: చేతిపై ఉన్న పట్ట బొట్టు ఆధారంగా చిన్నారి అత్యాచార నిందితుడు రాజు మృతదేహాన్ని.. వారి కుటుంబ సభ్యులు గుర్తించారని వరంగల్ టౌన్ ఏసీపీ గిరి కుమార్ తెలిపారు. ఎంజీఎం మార్చురీలో రాజు మృతదేహానికి

ఆ మృతదేహం రాజుదే..: వరంగల్ టౌన్ ఏసీపీ

వరంగల్: చేతిపై ఉన్న పట్ట బొట్టు ఆధారంగా చిన్నారి అత్యాచార నిందితుడు రాజు మృతదేహాన్ని.. వారి కుటుంబ సభ్యులు గుర్తించారని వరంగల్ టౌన్ ఏసీపీ గిరి కుమార్ తెలిపారు. ఎంజీఎం మార్చురీలో రాజు మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియను మొదలుపెట్టారు. మరి కొద్దిసేపట్లో మృతదేహాన్ని రాజు స్వస్థలానికి.. భారీ బందోబస్తు నడుమ తరలించునున్నట్లు ఏసీపీ తెలిపారు.


నస్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్య చేసుకున్నాడని.. అతడేనని ధ్రువీకరించేందుకు రాజు బావమరుదులను తీసుకొచ్చినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులను మలక్‌పేట్ పోలీసులు వరంగల్‌కి తీసుకొచ్చారన్నారు. సూర్యాపేట మండలం పోల్‌మల్ల గ్రామానికి చెందిన రాజు బావమరుదులు కేదిరి సురేష్, కేదిరి మహేష్‌లు.. మృతదేహాన్ని గుర్తు పట్టారని చెప్పారు. చేతిపై ఉన్న స్టార్స్ , మౌనిక అనే పేరును చూసి రాజునే అని ధ్రువీకరించినట్లు వివరించారు. జీఆర్పీ పోలీసుల సమక్షంలో పోస్ట్‌మార్టం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ పోలీసులకు సహకరిస్తామని ఏసీపీ పేర్కొన్నారు.

Updated Date - 2021-09-16T22:44:44+05:30 IST