రోడ్డున పడేశారు

ABN , First Publish Date - 2021-10-19T05:29:45+05:30 IST

రాక్‌ సిరామిక్స్‌లో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా విధుల్లోంచి తొలగించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు.

రోడ్డున పడేశారు

ఆందోళన నిర్వహిస్తున్న సిరామిక్స్‌ ఉద్యోగులు
భానుగుడి(కాకినాడ), అక్టోబరు 18: రాక్‌ సిరామిక్స్‌లో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా  విధుల్లోంచి తొలగించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లా డుతూ ముందస్తుగా కార్మికులకు కనీసం చెప్పకుండా విధుల నుంచి తొలగించడం రాక్‌ సిరామిక్స్‌కు పరపాటిగా మారిపోయిందన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను గేటు బయట ఆపి విధుల నుంచి తీసేశామని చెప్పడం హస్యా స్పదంగా ఉందన్నారు. కంపెనీ లాభాల్లోనూ, ఉత ్పత్తిలోనూ, అభివృద్ధిలోనూ కార్మికుల పాత్ర కీలకమని అలాంటి కార్మికులను ఏ తప్పు చేయకుండా విధుల నుంచి చెప్పాపెట్టకుండా ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోలేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ యూనియన్‌ అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ, సిరామిక్స్‌ వర్కర్లు నాగార్జున, రాజేష్‌, శ్రీనివాస్‌, సత్య, శ్రీనివాస్‌, వీరవెంకటరమణ, గణేష్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:29:45+05:30 IST