డ్రగ్స్ కేసు: బీజేపీ నేతకు మార్చి 1 వరకు కస్టడీ పొడగింపు

ABN , First Publish Date - 2021-02-25T01:19:24+05:30 IST

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర విభాగానికి చెందిన రాకేష్ సింగ్‌కు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ కైలాష్ విజయవర్గీయతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్రమంగా నిషేధిత కొకైన్‌ను రవాణా చేస్తున్న

డ్రగ్స్ కేసు: బీజేపీ నేతకు మార్చి 1 వరకు కస్టడీ పొడగింపు

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ నేత పామెల గోస్వామి డ్రగ్స్ కేసులో అరెస్టైన అదే పార్టీకి చెందిన నేత రాకేష్ సింగ్‌(52)కు మార్చి 31 వరకు పోలీసు కస్టడీని పొడగించారు. బుధవారం కోల్‌కతాలోని ఎన్‌డీపీఎస్ కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ కేసులో రాకేష్‌ను మంగళవారం కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర విభాగానికి చెందిన రాకేష్ సింగ్‌కు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ కైలాష్ విజయవర్గీయతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్రమంగా నిషేధిత కొకైన్‌ను రవాణా చేస్తున్న బీజేపీ నేత పమెలా గోస్వామిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారులో నుంచి 100 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుతో లింకు ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు.


అయితే మొదట కోర్టు ముందు హజరు కావాలంటూ రాకేష్ సింగ్‌కు నోటీసులు పంపించారు. అయితే ఫిబ్రవరి 26 వరకు తాను కోర్టు ముందు హాజరు కాలేనని రాకేష్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఫిబ్రవరి 23న బెంగాల్‌లోని బద్రామన్ జిల్లా నుంచి పారిపోతుండగా కోల్‌కతా పోలీసులు పట్టుకున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్ని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-02-25T01:19:24+05:30 IST