ఎస్పీ కూటమికి మద్దతిచ్చిన రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్

ABN , First Publish Date - 2022-01-17T00:58:40+05:30 IST

ఉత్తరప్రేదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ-రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ మద్దతు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా నిరవధికంగా జరిగిన రైతుల ఉద్యమంలో రాకేశ్ టికాయత్ కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీని ఓడించాలని ప్రచారం కూడా

ఎస్పీ కూటమికి మద్దతిచ్చిన రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్

లఖ్‌నవూ: ఉత్తరప్రేదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ-రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ మద్దతు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా నిరవధికంగా జరిగిన రైతుల ఉద్యమంలో రాకేశ్ టికాయత్ కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీని ఓడించాలని ప్రచారం కూడా చేశారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాకేశ్ టికాయత్ రాజకీయాల్లోకి వస్తారని, లేదంటే ఏదైనా రాజకీయపరమైన అడుగు వేస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై గతంలో ఆయనను ప్రశ్నిస్తే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని, ప్రభుత్వం చేయాల్సినవి ఇంకా ఉన్నాయని టికాయత్ చెప్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో మరో అడుగు ముందుకు వేసి బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతు ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2022-01-17T00:58:40+05:30 IST