Abn logo
Aug 22 2021 @ 16:13PM

లోటస్ పాండ్‌లో ఘనంగా రాఖీ పండగ

హైదరాబాద్: లోటస్ పాండ్‌లో ఘనంగా రాఖీ పండగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు షర్మిల రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

క్రైమ్ మరిన్ని...