Abn logo
Aug 4 2020 @ 05:02AM

వైభవంగా రక్షాబంధన్‌

సోదర ప్రేమను చాటి చెప్పిన సోదరీమణులు

పలువురు నాయకులకు రాఖీలు కట్టిన వారి సోదరీమణులు


కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 3: రాఖీ పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నివర్గాలకు చెందిన మహిళలు వారి సోదరులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. దూరప్రాంతాల్లో ఉన్నవారు పోస్టు లేదా కొరియర్‌ల ద్వారా రాఖీలు పంపారు. రాఖీల అమ్మకాల వద్ద, స్వీట్‌ షాపుల వద్ద జనసందడి కనిపించింది. బ్రాహ్మణులు జంధ్యాలు మార్చుకుని ఉపాకర్మలు ఆచరించారు. పలువురు నాయకులకు వారి సోదరీమణులు, మహిళా కార్పొరేటర్లు రాఖీలు కట్టి  శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌, అతని సోదరులకు సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలత రాఖీలు కట్టారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తోపాటు అతని సోదరులు శ్రావణ్‌కుమార్‌, సంపత్‌కుమార్‌లకు సోదరి శైలజ రాఖీలు కట్టారు. మేయర్‌ వై సునీల్‌రావుకు హైదరాబాద్‌ నుంచి ఆయన అక్కలు పంపిన రాఖీలను తన తమ్ముడు కూతురు రిషిత కట్టారు.

Advertisement
Advertisement