Abn logo
Jan 13 2021 @ 18:47PM

టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం రకుల్‌ సైక్లింగ్‌

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా 'మేడే' చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే షూటింగ్‌కే టైమ్‌ సరిపోతుండటంతో  రకుల్‌ ఆ సమయాన్ని తెలివిగా ప్లాన్‌ చేసుకుని వినియోగించుకుంది. దాదాపు 12 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ షూటింగ్‌కు వెళ్లింది రకుల్‌ ప్రీత్. ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన రకుల్ ప్రీత్‌ సింగ్‌ ' నేను ఏం చెబుతున్నానంటే.. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం సెట్స్‌కు 12 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ వెళ్లాను' అని మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేసింది రకుల్‌. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోన్న 'మే డే' సినిమాను అజయ్‌ దేవగణ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. తెలుగులో నితిన్‌ హీరోగా చంద్ర శేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెక్‌' సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాయర్‌ పాత్రలో నటిస్తోంది. Advertisement
Advertisement
Advertisement