Abn logo
Jul 7 2020 @ 17:04PM

పారితోషికం సగం తగ్గించుకున్న రకుల్?

వరుస విజయాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించిన రకుల్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషికం అందుకుందట. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో హీరోహీరోయిన్లు పారితోషికం విషయంలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. 


ఇప్పటికే కీర్తి సురేష్, తాప్సీ వంటి హీరోయిన్లు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి రకుల్ కూడా చేరిందట. నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం రకుల్ తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకుందట. 50 నుంచి 60 లక్షలు మాత్రమే తీసుకుంటోందట. ఇతర సినిమాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాలని రకుల్ నిర్ణయించుకుందట. 

Advertisement
Advertisement
Advertisement