Abn logo
Jun 3 2020 @ 15:50PM

గోపీచంద్‌తో మ‌రోసారి జ‌త క‌డుతున్న హీరోయిన్‌?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. అందులో ఒక‌టి రానాతో చేస్తుంటే మ‌రో సినిమాను గోపీచంద్‌తో తెర‌కెక్కించ‌బోతున్నాడు. గోపీచంద్ సినిమాకు ‘ఆలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గోపీచంద్ హీరో.. మ‌రి హీరోయిన్‌గా ఎవ‌ర్ని తీసుకోవాల‌నే దానిపై తేజ పెద్ద క‌స‌రత్తులే చేస్తున్నాడ‌ని టాక్‌. గోపీచంద్ ప‌క్క‌న అనుష్క‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను క‌థానాయిక‌గా ఓకే చేస్తార‌ని వార్త‌లు బాగానే వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ చేరింది. ఆమె ఎవ‌రో కాదు.. ర‌కుల్ ప్రీత్ సింగ్‌. అంతా ఓకే అయితే ఈ అమ్మ‌డు గోపీచంద్‌తో ‘లౌక్యం’ త‌ర్వాత న‌టించే చిత్ర‌మిదే అవుతుంది. కొన్నిరోజుల్లో ఈ విష‌యంపై క్లారిటీ రానుంది. 

Advertisement
Advertisement
Advertisement