Abn logo
Sep 24 2020 @ 11:39AM

డ్రగ్స్ కేసు: రకుల్‌కు మరికొంత సమయం కావాలా?

Kaakateeya

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రియురాలు రియా, ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. రియా ఫోన్ డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు సమన్లు పంపించింది. 


విచారణకు రావాల్సిందిగా ప్రముఖ కథానాయికలు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌‌లకు నోటీసులు పంపించింది. అయితే రకుల్ మాత్రం ఇంకా నోటీసులు అందుకోలేదట. తమకు సమన్లు అందలేదని రకుల్ టీమ్ పేర్కొంటోంది. అయితే అటు హైదరాబాద్‌లోగాని, ఇటు ముంబైలోగాని రకుల్ తమకు అందుబాటులోకి రాలేదని, ఆమె ఇంకా స్పందించలేదని ఎన్‌సీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. విచారణకు వచ్చేందుకు మరికొంత సమయం కావాలని రకుల్ విజ్ఞప్తి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement