Abn logo
Oct 24 2020 @ 10:49AM

శభాష్.. డైరెక్టర్ క్రిష్!

Kaakateeya

`గౌతమిపుత్ర శాతకర్ణి` లాంటి చారిత్రక చిత్రాన్ని పరిమిత బడ్జెట్‌లో కేవలం 80 రోజుల్లోనే అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ క్రిష్. తాజాగా మరోసారి క్రిష్ తన సూపర్ స్పీడ్‌తో ఆకట్టుకున్నారు. కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న ఇలాంటి తరుణంలో కూడా తన కొత్త సినిమా షూటింగ్‌ను కేవలం 40 రోజుల్లో పూర్తి చేయబోతున్నారు. 


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా అటవీ నేపథ్యంలో క్రిష్ ఈ సినిమాను రూపొందించారు. వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఈ సినిమాను షూట్ చేశారు. కరోనా, భారీ వర్షాలు వంటి వాటిని లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు. ఇంకో ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. దీని చిత్రీకరణ మరో ఐదు రోజుల్లో పూర్తి కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడం పట్ల రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. `డ్రీమ్ టీమ్.. డ్రీమ్ రోల్.. ఇంకా ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంద`ని రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 



Advertisement
Advertisement