Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిడ్స్‌ను తరిమికొడదాం

ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినంలో వక్తల పిలుపు

అవగాహన సదస్సులు, ర్యాలీలు

తణుకు, డిసెంబరు 1: ఎయిడ్స్‌ను అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అరుణ అన్నారు. బుధవారం ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా సిబ్బంది తో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు.  న్యాయమూర్తి బాబు, డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య, ఎస్‌ఎస్‌ రెడ్డి, ఐయంఏ కార్యదర్శి రమేష్‌కుమార్‌, ఏఆర్‌టీ వైద్యుడు డాక్టర్‌ సుంకవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌. వెంకటేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కేఎన్‌వీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు రెడ్‌ రిబ్బన్‌ గుర్తు ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇరగవరం: ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇరగవరం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ వి.లక్ష్మి అన్నారు.  ఎయిడ్స్‌పై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి సోకకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.  

భీమడోలు: స్థానిక శ్రీ వేంకటేశ్వర జూనియర్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, భీమడోలు ప్రాంతీయ ఆస్పత్రి సిబ్బంది గ్రామంలో అవగాహన ర్యాలీ  నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిపాల్‌ ఎయిడ్స్‌పై వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌  రవికుమార్‌  తదితరులు పాల్గొన్నారు.

గణపవరం:  బుధవారం  కాశిపాడు, సీహెచ్‌. అగ్రహారం గ్రామాల్లో ఎయిడ్స్‌ నివారణపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. డిప్యూటీ పారా మెడికల్‌ అధికారి  రమేష్‌, పీఎంపీల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్లు, సర్పంచ్‌లు కోట నాగేశ్వరరావు, చుక్కా అప్పారావు,  వీఆర్వో సంఘం మండల అధ్యక్షుడు కేశవమూర్తి, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, తదితరులు పాల్గొన్నారు. గణపవరంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కాళ్లకూరి సత్యనారాయణమూర్తి, పీఎంపీల మండల అధ్యక్షుడు ఎం.సత్య నారాయణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్‌ అడబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన  కార్యక్రమంలో  ప్రిన్సిపాల్‌ పి.మధురాజు పాల్గొన్నారు.  

తాడేపల్లిగూడెం రూరల్‌: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీఐ ఆకుల రఘు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గుడ్‌ ల్యాంప్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  సంస్థ పీడీ  దాస్‌, మేనేజర్‌ అశోక్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

పెంటపాడు:  పెంటపాడు డీఆర్‌ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  విద్యార్థులకు ఎయిడ్స్‌ నివారణా మార్గాలపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం  కళాశాల నుంచి గాంధీబొమ్మ సెంటర్‌ వరుకూ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి  మానవహారం నిర్మించారు.  కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పీ.ఎస్‌.బ్రహ్మచారి, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ అధ్యక్షురాలు వి. కుసుమకుమారి, ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వాహకులు డాక్టర్‌ కంబయ్య, అధ్యాపకులు  పాల్గొన్నారు.

నిడదవోలు:  తిమ్మరాజుపాలెంలోని హోలీక్రాస్‌ కమ్యూనిటీ కాలేజ్‌ విద్యార్థినులు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి, హోలీక్రాస్‌ హాస్పటల్‌ వద్ద ఎయిడ్స్‌పై అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.తాతారావు, హోలీక్రాస్‌ హాస్పటల్‌ డాక్టర్‌ సిస్టర్‌ ధన్య, హోలీక్రాస్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ సిస్టర్‌ జోబిన పాల్గొన్నారు.

ఉండ్రాజవరం: వేలివెన్నులో ఛైల్డ్‌ ఫండ్‌ ఇండియా,  పంచాయతీ  ఆధ్వర్యంలో మంగళవారం ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు జరిగింది.  నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేవారు.  సర్పంచ్‌ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ బూరుగుపల్లి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement