రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-19T06:31:53+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
హనుమాన్‌జంక్షన్‌లో ర్యాలీ

 హనుమాన్‌జంక్షన్‌, జనవరి 18 : రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. అఖిల భారత్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం హనుమాన్‌జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించారు.   మహిళా రైతు సమాఖ్య అధ్యక్షురాలు మూల్పూరి సాయికళ్యాణి, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు ప్రసంగిం చారు. మహిళా రైతు నేతలు పిన్నిమనేని లావణ్య, వడ్డిల్లి లక్ష్మీ, ఏపీ రైతు సమ న్వయ సమితి నేతలు గుండపనేని ఉమావర ప్రసాద్‌, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌, యనమదల వెంకయ్యరావు తదితరులు  పాల్గొన్నారు. 

ఫపెనమలూరు : రైతుల పోరాటాలకు కేంద్రం స్పందించాలని తూర్పు కృష్ణా ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలు పిన్నమనేని విజయమ్మ అన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతూ సోమవారం పోరంకి సెంటర్‌ నుంచి పెనమలూరు వైపుగా నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ నేతలు ఉప్పాడ త్రిమూర్తులు, ఎస్‌కె ఖాసీం, పుసులూరి పాత లక్ష్మి, జి. లక్ష్మి పాల్గొన్నారు. 

ఫ గన్నవరం : కేంద్రం చేసిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ పోరాటం ఆపేది లేదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఎం, సీపీఐ నేతలు సోమవారం ధర్నా చేశారు. కళ్ళం వెంకటేశ్వరరావు, పెద్దు వాసుదేవరావు, వెంకటేశ్వరరావు, ఏసుదాసు, నాగలక్ష్మి పాల్గొన్నారు. 

ఫ ఉయ్యూరు : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా  రైతు సంఘాల పిలుపు మేరకు స్థానిక ఉయ్యూరు సెంటర్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా జరిగింది. సీఐటియూ మండల కార్యదర్శి కోసూరి శివనాగేంద్రం, మహిళా సంఘం నేతలు ఝాన్సీ, పద్మ, సీతామహాలక్ష్మి, భూలక్ష్మి, నాగమణి,  రైతు సంఘం నేతలు అన్నేసుబ్బారావు, కొండలు, కేవైకె రెడ్డి, ఇస్మాయిల్‌ ఈ ధర్నాలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:31:53+05:30 IST