మనం చేసిన పని బావుంది.. అంతా మంచే జరుగుతుందని మన పెద్దవాళ్లు ఒక మాట అంటే చాలు మనం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి రెడీ అయిపోతాం. ఇప్పుడు అలాంఇ కాంప్లిమెంటే యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్‌కు దక్కింది. వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమా టీజర్ రీసెంట్గా విడుదలైంది. ఈ టీజర్ బావుందంటూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఉప్పెన టీజర్‌ను చూసి ట్విట్టర్లో అభినందించారు. "ఉప్పెన టీజర్ బావుంది. నా సోదరుడు వైష్ణవ్‌తేజ్, క్రితి శెట్టి జోడీ ఫ్రెష్ లుక్‌లో కనపడుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు, ఇతర యూనిట్‌కు అభినందనలు.. ఆల్ ది బెస్ట్" అన్నారు రామ్‌చరణ్. మక్కల్ సెల్వన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదల తేదిని నిర్మాతలు త్వరలోనే ప్రకటిస్తారని వినికిడి.