Abn logo
Sep 24 2020 @ 14:35PM

చెర్రీ నిర్ణయంతో కొరటాల హ్యాపీ!

Kaakateeya

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఆ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే లోపు `ఆచార్య`లో నటించాలని చెర్రీ అనుకుంటున్నాడు. ఈ నిర్ణయం దర్శకుడు కొరటాల శివకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందట. 


`భరత్ అనే నేను` తర్వాత `ఆచార్య` కోసం కొరటాల దాదాపు రెండేళ్లు వెయిట్ చేశారు. తీరా ప్రారంభమయ్యాక కరోనా వచ్చి పడింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది. నవంబర్ నుంచి షూటింగ్‌కు హాజరు కావాలని చిరంజీవి అనుకుంటున్నారట. అయితే చిరంజీవి వచ్చే లోపు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోమని కొరటాలకు చెర్రీ చెప్పాడట. `ఆర్ఆర్ఆర్` పూర్తయ్యే వరకు చెర్రీ కోసం ఆగాల్సి ఉంటుందేమోనని కొరటాల అనుకున్నారు. అయితే ఇప్పుడు చెర్రీ అందుబాటులో ఉండడంతో వచ్చే నెల నుంచి కొరటాల సెట్స్ మీదకు వెళ్లబోతున్నారట.  


Advertisement
Advertisement
Advertisement