Ram janmabhoomi తీర్థ క్షేత్రాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేస్తాం: వీహెచ్‌పీ చీఫ్

ABN , First Publish Date - 2021-12-13T16:08:08+05:30 IST

అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్రాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేసి హిందుత్వానికి ప్రతీకగా వెలుగొందేలా చేస్తామని...

Ram janmabhoomi తీర్థ క్షేత్రాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేస్తాం: వీహెచ్‌పీ చీఫ్

అయోధ్య: అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్రాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేసి హిందుత్వానికి ప్రతీకగా వెలుగొందేలా చేస్తామని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది.అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్రాన్ని వాటికన్ సిటీ, మక్కా తరహాలో అభివృద్ధి చేస్తామని, హిందుత్వానికి ప్రతీకగా తీర్చిదిద్దుతామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు రవీంద్ర నారాయణ్ సింగ్ వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ధంతోలి ప్రాంతంలో విశ్వహిందూ జనకళ్యాణ్ పరిషత్ విదర్భ రీజియన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో సింగ్ పాల్గొన్నారు.దేశంలో మత మార్పిడి లక్ష్యంగా విదేశీ నిధులు వెచ్చించడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోందని సింగ్ చెప్పారు. 


దేశ సేవలో హిందువులతో కలిసి రావాలని ముస్లిం సమాజానికి సింగ్ విజ్ఞప్తి చేశారు.హిందువులు తమకు ఏమీ జరగదని అనుకుంటున్నారని, ఈ మనస్తత్వం కారణంగానే సవాళ్లను ఎదుర్కొంటున్నామని సింగ్ అన్నారు.‘‘మిషనరీలు హిందూ ధర్మాన్ని నిర్మూలించడానికి సరైన ప్రణాళికతో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. హిందువులు హిందుత్వాన్ని,తమను తాము రక్షించుకోవడానికి ఐక్యమై బలమైన శక్తిగా మారాలి’’అని సింగ్ కోరారు.జనకళ్యాణ్ పరిషత్ యొక్క రాబోయే కార్యాలయం తూర్పు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం అంతటా హిందువుల కోసం వివిధ సంక్షేమ చర్యలను ప్రారంభిస్తుందని సింగ్ చెప్పారు.




Updated Date - 2021-12-13T16:08:08+05:30 IST