Abn logo
Sep 24 2021 @ 00:19AM

రామ్‌రాజ్‌ కాటన్‌.. ధోవతి శతాబ్ది వేడుకలు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించిన సందర్భంలో జాతిపిత మహాత్మాగాంధీ నిరాడంబరత కోసం ధరించిన ధోవతికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భం గా రామ్‌రాజ్‌ కాటన్‌.. తమిళనాడులోని తిరుపూర్‌లో ధోవతి-100 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. గాంధీజీ ధోవతిని తన వస్త్రధారణగా మార్చుకుని వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 మంది అమరవీరులు, 100 మంది నేత కార్మికులను రామ్‌రాజ్‌ కాటన్‌ సత్కరించింది. అంతేకాకుండా వంద మొక్కలను నాటింది.


ఈ సందర్భంగా రామ్‌రాజ్‌ కాటన్‌ ఎండీ కేఆర్‌ నాగరాజన్‌ మాట్లాడుతూ... మహాత్ముని వస్త్రధారణ, గుర్తింపు చిహ్నం గా మారిందన్నారు. గాంధీజీ ధోవతి వస్త్రధారణ భారతీయలందరికి ఎంతో ఉత్తేజాన్నిచ్చిందని... దీన్ని ఇలాగే కొనసాగించేందుకు  నా వస్త్రం ధోవతి వైపు అనే నినాదాన్ని ప్రజ ల్లో తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. 40 వేల మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గడచిన నలభై ఏళ్లుగా వారికి అండగా ఉంటూ వస్తున్నట్లు నాగరాజన్‌ వెల్లడించారు.


కాగా ఈ సందర్భంగా మహాత్మువై కొండదువోమ్‌ అనే పుస్తకాన్ని కోయంబత్తూర్‌ భారతీయ విద్యా భవన్‌ చైర్మన్‌ బీకే కృష్ణరాజ వనవరాయర్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకం మొదటి కాపీని రూట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ కె రామస్వామికి అందజేశారు. అంతకుముందు చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన నృత్యకారులు గాంధీయ వాజిల్‌ రామరాజ్‌ అనే సంప్రదాయ నృత్య నాటకాన్ని ప్రదర్శించారు.