అమూల్యను చంపితే రూ. 10 లక్షలు.. బహుమతి ప్రకటించిన శ్రీరాం సేన

ABN , First Publish Date - 2020-02-23T03:36:09+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన

అమూల్యను చంపితే రూ. 10 లక్షలు.. బహుమతి ప్రకటించిన శ్రీరాం సేన

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన అమూల్య లియోనా తలకు శ్రీరాంసేన వెలకట్టింది. ఆమె చంపిన వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని ఓ వీడియోలో ప్రకటించింది. ఆ వీడియో ఫుటేజీలో శ్రీరాం సేన కార్యకర్త సంజీవ్ మరాడి మాట్లాడుతూ.. అమూల్యను విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ఆమెను విడుదల చేస్తే చంపేస్తానని హెచ్చరించారు. ‘‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దు. ఒకవేళ ఆమె బయటకి వచ్చిందంటే చంపేస్తాం’’ అని ఆ వీడియోలో సంజీవ్ చెప్పడం స్పష్టంగా వినిపించింది. అంతేకాదు, ఆమెను చంపిన వారికి రూ. 10 లక్షలు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ వీడియో గురించి బళ్లారి ఎస్పీ సీకే బాబా వద్ద ప్రస్తావించినప్పుడు.. ఆ వీడియోను తాను చూడలేదని, ఆ ప్రకటన గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ విషయమై ఆరా తీస్తామని తెలిపారు. 

Updated Date - 2020-02-23T03:36:09+05:30 IST