Abn logo
Aug 1 2020 @ 16:05PM

ప్రతి భారతీయుడ్ని సంప్రదించిన తర్వాతే మందిర నిర్మాణం జరుగుతోంది : కమల్‌నాథ్

భోపాల్ : ప్రతి భారతీయుడ్ని సంప్రదించిన తర్వాతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ‘‘అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నా. రామ మందిర నిర్మాణం దేశ ప్రజల చిరకాల వాంఛ. ప్రతి భారతీయుడ్ని సంప్రదించిన తర్వాతే మందిర నిర్మాణానికి పూనుకున్నారు. ఇది కేవలం భారతదేశంలోనే సాధ్యమవుతుంది’’ అని కమల్‌నాథ్ స్పష్టం చేశారు.


ప్రతి ఒక్కరి విశ్వాసంలో రాముడు కేంద్ర బిందువుగా ఉన్నాడని, రాముడిపై ఉన్న విశ్వాసంతోనే దేశం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాముడి జన్మస్థలమైన అయోధ్యలో మందిర నిర్మాణం జరగాలని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఇదే వాంఛించారని ఆయన పేర్కొన్నారు.


రామ మందిర ముహూర్తం గురించి మాట్లాడుతూ... దేశంలోని 90 శాతం మంది హిందువులు ముహూర్తాలను, జ్యోతిషాన్ని నమ్ముతుంటారని అన్నారు. ఆగస్టు 5 ముహూర్తం విషయంలో తాను మాత్రం తటస్థంగానే ఉంటానని, మత విశ్వాసాలతో ప్రజలను ఆడుకుంటున్నారని కమల్‌నాథ్ ఆరోపించారు. 

Advertisement
Advertisement
Advertisement