Jun 3 2021 @ 13:19PM

మురగదాస్‌తో ఎనర్జిటిక్ హీరో..?

కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడనే తాజా వార్త అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే రామ్ - మురగదాస్‌ల మధ్య కథా చర్చలు జరిగాయట. ఆయన చెప్పిన కథ హీరోకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు, తమిళంలో దీనిని తెరకెక్కించబోతున్నారట. 'స్టాలిన్', 'స్పైడర్' సినిమాలను తెరకెక్కించిన మురగదాస్‌కు టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆయన తీసిన 'గజిని','తుపాకి',' సెవెంత్  సెన్స్', 'సర్కార్', 'దర్బార్' వంటి సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో రామ్ - మురగదాస్‌ల కాంబినేషన్‌కి మంచి క్రేజే ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవనున్నాయట. ఇక రామ్ ప్రస్తుతం ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. మాధవన్ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.