రామారావు డ్యూటీ డేటు ఫిక్సు

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దివ్యాంశ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని  2022 మార్చి 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘మార్చి చివరి వారం నుంచి వేసవి సీజన్‌ ప్రారంభం కానుంది. మా సినిమాతోనే ఈ సీజన్‌కి శ్రీకారం చుట్టాలనుకున్నాం. కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. రవితేజ పాత్ర కొత్త పంధాలో సాగుతుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింద’’న్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, కళ: సాహి సురేష్‌. 


Advertisement