నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-14T06:10:03+05:30 IST

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

నిజామాబాద్‌కల్చరల్‌, ఏప్రిల్‌ 13: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం ఉపవాస దీక్షను ప్రా రంభించి సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షలను ముగిస్తారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ మాసంకు మసీదులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం మసీదులలో పరిమిత సంఖ్యలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని మిగతావారు తమ ఇళ్లలో ఐదు సార్లు నమాజ్‌ చేసుకోవాలని మత పెద్దలు సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధాన మసీదులలో ప్రత్యేక కరోనా నియమాలకు అనుగుణంగా ప్రార్థణలకు ఆయా మసీద్‌ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. 


Updated Date - 2021-04-14T06:10:03+05:30 IST