విద్యార్థి, యువజన సంఘాల నేతలను విడుదల చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-11-28T16:06:00+05:30 IST

అనంతపురంలో అరెస్టు చేసిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

విద్యార్థి, యువజన సంఘాల నేతలను విడుదల చేయాలి: రామకృష్ణ

అనంతపురం : అనంతపురంలో అరెస్టు చేసిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకోండి అంటే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. అనంతపురంలో నిన్న అరెస్టు చేసిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను ఇప్పటి వరకు విడిచిపెట్టకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-28T16:06:00+05:30 IST