Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద నష్టంలో మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది: సీపీఐ రామకృష్ణ

కర్నూల్: వరదలు వర్షాలతో రాష్ట్రంలో అపార పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఈ వర్షాలు పూర్తిగా ముంచేశాయన్నారు. మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక.. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని, అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతులు చేయలేదని ఆరోపించారు.


ఇసుక మేటలు వేసిన ఎకరాకు రూ. 5 వేలు ఇస్తామంటున్నారు.. మేం ఎకరాకు రూ.50 వేలు ఇస్తాం ప్రభుత్వం చేసి చూపించాలని  రామకృష్ణ ఛాలెంజ్ చేశారు. పంట రుణాలు మాఫీ చేయాలని, ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ఆదివారం విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఎంపీలు ఆశించిన స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకరాలేక పోతున్నారని రామకృష్ణ మండిపడ్డారు.

Advertisement
Advertisement