Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రైవేటు సంస్థలలో కూడా రిజర్వేషన్‌లు అమలు చేయాలి: రామకృష్ణ

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేకరణ దిశగా పాలన చేస్తున్నారని విమర్శించారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వం రంగ సంస్థలను దోచి పెడుతున్నారని, ప్రైవేటు సంస్థలలో కూడా రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ స్పూర్తికి విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. లౌకికవాదులంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పాలనను నిలదీయాలని రామకృష్ణ పిలుపు ఇచ్చారు.


జల్లి విల్సన్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసేలా పాలన ఉండాలన్నారు. ఆయన చెప్పిన విధంగా రిజర్వేషన్‌లు అమలు చేయడం లేదన్నారు. న్యాయశాఖలో కూడా పాటించకపోవడం విచారకరమన్నారు. కేంద్ర పాలకులు కూడా మతాల వారీగా విడగొడుతున్నారని, న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ అమలు చేయాలని, కొలీజియంను కుడా మార్చి... రాజ్యాంగ బద్దంగా నియామకాలు చేపట్టాలని జల్లి విల్సన్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement