అయ్యన్నపాత్రుడు ఏమైనా టెర్రరిస్టా? ఆయన్ను కలిస్తే తప్పేంటి?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-30T16:00:03+05:30 IST

అమరావతి: డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటి... ఆయనపై కక్ష సాధింపు ఎందుకని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అయ్యన్నపాత్రుడు ఏమైనా టెర్రరిస్టా? ఆయన్ను కలిస్తే తప్పేంటి?: రామకృష్ణ

అమరావతి: డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటి... ఆయనపై కక్ష సాధింపు ఎందుకని సీపీఐ  ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు ఏమైనా టెర్రరిస్టా.. ఆయన్ని కలిస్తే తప్పేంటని నిలదీశారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ నియామకాల్లో 42 మంది తన  సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారన్నారు. సామాజిక వర్గం గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదని... కాకస్ ముఠాగా ఏర్పడి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. 


రాజకీయ నాయకులతో పాటు మీడియాను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. అక్కడితో ఆగకుండా హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగడం లేదని... అధికార పార్టీలో ఉన్న వారిని కూడా ఎదురు ప్రశ్నిస్తే అణచివేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఎస్ఈసీ మళ్లీ పగ్గాలు చేపట్టడాన్ని అభినందిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం వారికుండే హక్కన్నారు. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ చర్యను సమర్ధిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. దౌర్జన్యాలు, బెదరింపుల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపిస్తారా అని ప్రశ్నించారు. మొదటి నుంచి మళ్లీ ఎన్నికలు జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-30T16:00:03+05:30 IST