కోట్లాది రూపాయల ప్రకటనలిచ్చి.. జగన్ గొప్పలకు పోతున్నారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-30T16:50:02+05:30 IST

అమరావతి: ఏడాది పాలనపై కోట్లాది రూపాల ప్రకటనలు ఇచ్చి ఏపీ సీఎం జగన్ గొప్పలకు పోతున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

కోట్లాది రూపాయల ప్రకటనలిచ్చి.. జగన్ గొప్పలకు పోతున్నారు: రామకృష్ణ

అమరావతి: ఏడాది పాలనపై కోట్లాది రూపాల ప్రకటనలు ఇచ్చి ఏపీ సీఎం జగన్ గొప్పలకు పోతున్నారని సీపీఐ  ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నవరత్నాల అమలు కంటే కక్షసాధింపు దోరణికే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అప్రజాస్వామిక ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. 22 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలను ప్రత్యేక హోదా హామీతో మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్నార్సీకి మద్దతిస్తామని ఎందుకు చెప్పలేదని రామకృష్ణ నిలదీశారు.


పారిశ్రామికవేత్తకు రాజ్యసభ సీటు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధమని ప్రచారం చేశారని.. కనీసం నియంత్రణ కూడా చేయలేదన్నారు. దేవుడి గుళ్లు తెరవకుండా వైన్ షాపులు ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిషేధం అన్న వ్యక్తి మద్యం షాపులను లాక్ డౌన్ సమయంలో తెరవడానికి కారణం ఏంటన్నారు. దాతలు ఇచ్చిన విలువైన భూములను నవరత్నాల కోసం అమ్ముకుంటారా అని నిలదీశారు. ప్రభుత్వ స్ధలాలు అమ్మి నవరత్నాలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2020-05-30T16:50:02+05:30 IST