Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్‌: రామకృష్ణ

విజయవాడ: తాము ఉద్యమం చేస్తామని చెప్తే వెంటనే ఆ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఏదో ఒక ప్రకటన చేసి ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు.  మంగళవారం టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్‌లో అఖిల పక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో తెలుగుదేశం నేత ఆలపాటి రాజా, కె. రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి బొత్స ఒక బ్లఫ్ మాస్టర్‌లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులకు గృహాలు ఇస్తామని అసత్య ప్రకటన చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి జంకుతున్నాయన్నారు. ఏ రకంగా ఇళ్లను ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో 110 పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఇళ్లను ఇచ్చే దాకా సెప్టెంబర్ 20వ తేదీన అన్ని నగరపాలక సంస్థ కార్యాలయాల వద్ద నిరవధిక నిరసనకు దిగుతామని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement