Abn logo
Sep 5 2021 @ 12:08PM

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. షరతులు పెట్టి పెన్షన్‌లలో కోత విధించడం సరికాదన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు పెట్టిన మొదటి సంతకం వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ల పెంపుపై అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవి సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు. భర్తలేని ఒంటరి మహిళలకు వయసు  తక్కువ ఉందనే సాకుతో పెన్షన్ నిలిపివేస్తున్నారని, గతంలో వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా తదుపరి ఒకేసారి ఇచ్చేవారన్నారు. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోకుంటే ఆపేస్తామని చెబుతున్నారని, సంక్షేమ పథకాల అమలులో షరతుల మెలికలు పెట్టడం సామాజిక బాధ్యతను విస్మరించడమేనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను రూ.3 వేలకు పెంచి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.