ఆర్కే మఠ్ సమ్మర్ క్యాంప్‌ రిజిస్ట్రేషన్లు షురూ!

ABN , First Publish Date - 2020-03-09T22:33:31+05:30 IST

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు కోర్సులు అందించే రామకృష్ణ మఠం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఆర్కే మఠ్ సమ్మర్ క్యాంప్‌ రిజిస్ట్రేషన్లు షురూ!

హైదరాబాద్: వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు కోర్సులు అందించే రామకృష్ణ మఠం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ‘శ్రద్ధ’ పేరుతో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్టిఫికేట్‌ కోర్సు రూపకల్పన చేసింది. వేసవి సెలవుల్లో ఏప్రిల్ 6న ప్రారంభమయ్యే క్యాంపు ఏప్రిల్ 18 వరకు జరగనుంది. తరగతుల్లో భాగంగా యోగాసనాలు, వివేకా మెడిటేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, శీల నిర్మాణం, నాయకత్వ నైపుణ్యాలు, విజయానికి 3హెచ్ ఫార్ములా, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు.. మొదలైన అంశాలు బోధించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 


దీంతో పాఠశాల విద్యార్థులకు సంస్కార్ - 2020 పేరుతో 15 రోజుల క్యాంపునకు రూపకల్పన చేశారు. ఏప్రిల్ 27న 4,5,6,7 తరగతులలోకి ప్రవేశించే విద్యార్థుల క్యాంప్ ప్రారంభం కానుంది. ఇవి మే 11 వరకు కొనసాగనున్నాయి. అలాగే 8,9,10 తరగతులలోకి ప్రవేశించే వారి క్యాంప్ మే 13న ప్రారంభం కాగా.. మే 27 వరకు కొనసాగునుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఈ తరగతులలో యోగాసనాలు, భజనలు, ధ్యానం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, నైతిక పాఠాలు, పరిశుభ్రత, సమయపాలన, స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ నిర్మాణం మొదలైన అంశాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

 

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

 

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-03-09T22:33:31+05:30 IST