ఒత్తిడిని అధిగమించడంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ తరగతులు

ABN , First Publish Date - 2021-06-16T22:37:23+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, యువతలో మూర్తిత్రయం స్ఫూర్తిని నింపుతోంది రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ).

ఒత్తిడిని అధిగమించడంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ తరగతులు

హైదరాబాద్: లాక్‌డౌన్‌ వేళ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, యువతలో మూర్తిత్రయం స్ఫూర్తిని నింపుతోంది రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ). ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను అధిగమించడంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమనికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. హరిద్వార్‌కు చెందిన డాక్టర్ స్వామి దయాధిపనానంద జీ, బెంగళూరుకు చెందిన వివేకానంద హెల్త్ గ్లోబల్ సహ స్థాపకురాలు డాక్టర్ వసుధ యం.శర్మ, యోగా గురువులు లివాంకర్ సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఐదు రోజులు ఉదయం 6.15 గంటల నుంచి 7.30 గం.ల వరకు తరగతులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ కొరకు 9177232696 వాట్సాప్ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెసేజ్ చేయగలరు. 

Updated Date - 2021-06-16T22:37:23+05:30 IST