నేటినుంచి ఘనంగా రామప్ప జాతర

ABN , First Publish Date - 2022-01-15T04:51:31+05:30 IST

తూప్రాన్‌ మండలంలోని ఇస్లాంపూర్‌ శివారులో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీయేటా మూడురోజులపాటు జాతర నిర్వహిస్తారు.

నేటినుంచి ఘనంగా రామప్ప జాతర
రామప్పగుట్టపైన వెలసిన ఆలయం

తూప్రాన్‌రూరల్‌, జనవరి 14: తూప్రాన్‌ మండలంలోని ఇస్లాంపూర్‌ శివారులో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీయేటా మూడురోజులపాటు జాతర నిర్వహిస్తారు. శనివారం నుంచి మొదలయ్యే జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం జా తర సందర్భంగా బండ్ల ఊరేగింపు, ఆదివారం గోపాల కాల్వల ఉత్సవం, పల్లకీసేవ, సోమవారం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తామని ఆలయకమిటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, సర్పంచు సుకన్యరమేశ్‌ పేర్కొన్నారు.

రామప్ప జాతరకు ఘనమైన చరిత్ర

చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం, పచ్చని పంటపొలాలు, నిండా నీళ్లతో కళకళలాడుతున్న రామప్పచెరువు సమీపంలో ఎత్తైన బల్లపరుపు బండపైన స్వయంభూలింగం, చెరువు వైపు కింది భాగంలో బండకింద ఉన్న సొరంగమార్గం, బండపైన ఏర్పడ్డ కోనేరుతో రామప్పగుట్ట ఆహ్లాదకరమైన ప్రకృతిశోభతో పర్యాటక ప్రదేశం గా కనిపిస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు అయోధ్య నుంచి భద్రాచలానికి వెళ్తూ మార్గంమధ్యలో ఉన్న ఈ గుట్టపైన సేదదీరినట్లు, స్వయం భూలింగాన్ని పూజించడం వల్ల రామలింగేశ్వరుడిగా, గుట్టకు రామప్ప గుట్టగా పేరువచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసేవారని, చెరువులో స్నానమాచరించేందుకు సొరంగమార్గాన్ని ఏర్పాటు చే సుకున్నట్లు  తెలిపారు. గుట్టపైన రామలింగేశ్వరాల యం, గణపతి, నవగ్రహ ఆలయాలు వెలిశాయి. ప్రభు త్వ నిధులతో  రామాలయం కూడా నిర్మాణమవుతోంది. జాతీయ రహదారి, మాసాయిపేట రైల్వేస్టేషన్‌కు రామప్పగుట్ట అతి సమీపంలోనే ఉండడడంతో ప్రజల రాకపోకలకు అనువైన ప్రదేశంగా ఉంది. దీంతో జాతరకు ఉమ్మడి మెదక్‌జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తుంటారు.



Updated Date - 2022-01-15T04:51:31+05:30 IST