Oct 22 2021 @ 16:32PM

#RC15 : పూనేలో షూటింగ్ మొదలైంది!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కలయికలో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ నేడు (శుక్రవారం) పూనేలో మొదలైంది. ఆ షెడ్యూల్ లో చెర్రీ, కియారా అద్వానీ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. దాదాపు రూ. 170 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది.  ఈ సినిమా చెర్రీ 15వ చిత్రం కాగా.. దిల్ రాజు బ్యానర్ లో ఇది 50వ చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, మలయాళ స్టార్ జయరాం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ లో గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ సినిమా .. ఇంత తొందరగా సెట్స్ పైకి వెళ్ళడం విశేషం. 



సాధారణంగా శంకర్ సినిమాలు రెండేళ్ళకు పైగానే షూటింగ్ జరుపుకంటూ ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం ఆయన కెరీర్ లోనే అతి తక్కువ సమయంలో చిత్రీకరణ కంప్లీట్ చేసుకోనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ విశేషాల్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. శంకర్ గత చిత్రం ‘2.0’ ఆశించని రీతిలో ఆడకపోయినా..  ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో శంకర్ తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.