Oct 9 2021 @ 15:44PM

#Rc 15 : అక్టోబర్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  మేకింగ్ జీనియస్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు 50వ  ప్రొడక్షన్ లో చెర్రీ 15వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా ఈ మధ్యనే గ్రాండ్ గా లాంఛయింది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది. దాని ప్రకారం RC15 మూవీ షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.


ఫస్ట్ షెడ్యూల్ ను పూణే లో ప్రారంభించబోతున్నారట. అక్కడ నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా..  మలయాళ స్టార్ జయరామ్, శ్రీకాంత్, సునీల్  సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం శంకర్ .. ఓ యూనిక్ పాయింట్ ను టచ్ చేయబోతున్నారట. ఆయన గత చిత్రాల కోవలోనే దీనికి కోసం ఓ సామాజిక సమస్యను లేవనెత్తుతున్నారట.  రీసెంట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ షూటింగ్ ను, తన పాత్రకి  డబ్బింగ్ ను పూర్తి చేసిన రామ్ చరణ్ అక్టోబర్ 21 నుంచి జరిగే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని టాక్. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమా దాదాపు రూ. 170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనుంది.