Abn logo
Mar 26 2020 @ 13:06PM

పవన్ స్ఫూర్తితో నేను సైతం: రామ్‌చరణ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సంక్షోభ సమయంలో పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో తాను రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించాడు.


ఇప్పటికే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు కలిగి ఉన్న రామ్‌చరణ్ తాజాగా ట్విటర్‌లోకి కూడా ప్రవేశించాడు. ఈ రోజు (గురువారం) ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. కరోనాపై పోరాటానికి విరాళాన్ని అందిస్తున్నట్టు తొలి ట్వీట్ చేశాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసించాడు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని సూచించాడు. 


Advertisement
Advertisement
Advertisement