Abn logo
Sep 24 2020 @ 11:49AM

చెర్రీ సూపర్ లుక్!

Kaakateeya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియో విడుదలై భారీ ఆదరణ సంపాదించుకుంది. 


ఆ వీడియోలో చెర్రీ అద్భుతంగా కనిపించాడు. కండలు తిరిగిన శరీరంతో, సిక్స్‌ప్యాక్ బాడీతో ఉన్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చెర్రీ పోస్ట్ చేసిన ఫొటో మెగాభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. తీక్షణంగా చూస్తున్న చెర్రీ సైడ్ ప్రొఫైల్‌ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. `సాధ్యమైనంత ఉన్నతంగా ఉండండ`ని చెర్రీ చేసిన కామెంట్ కూడా ఆకట్టుకుంటోంది.  



Advertisement
Advertisement
Advertisement