Abn logo
Aug 4 2020 @ 16:51PM

చెర్రీ ప్లానింగ్ అదేనా?

తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా `ఖైదీ నెంబర్ 150`తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా మారాడు. ఆ తర్వాత చిరంజీవి హీరోగానే అత్యంత భారీ బడ్జెట్ పెట్టి `సైరా` సినిమాను రూపొందించాడు. ఇక, మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న `ఆచార్య`ను నిరంజన్ రెడ్డితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. చిరంజీవి నటించబోయే అన్ని సినిమాలకు చెర్రీ నిర్మాతగా లేదా సహ నిర్మాతగా వ్యవహరించాలని ప్లాన్ చేస్తున్నాడట. 


చిరంజీవి తర్వాతి సినిమా `లూసిఫర్` రీమేక్‌ను కూడా చెర్రీయే నిర్మించనున్నాడు. ఈ నెల 22న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌కు ఓ సినిమా చేయాలని చిరంజీవి అనుకుంటున్నారు. ఆ సినిమాకు కూడా చెర్రీ సహ నిర్మాతగా వ్యవహరిస్తాడట. చిరంజీవి సినిమాలకే కాదు.. `ఆర్ఆర్ఆర్` తర్వాత తను నటించబోయే సినిమాలకు కూడా సహ నిర్మాతగా వ్యవహరించాలని చెర్రీ ప్లాన్ చేస్తున్నాడట. తన ఫ్యామిలీ హీరోలతోనూ, తన సన్నిహిత హీరోలతోనూ నిర్మాతగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. 


Advertisement
Advertisement
Advertisement