వరుస పరాజయాలతో సతమతమైన మాస్ మహారాజ్ రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ పండుగకు `క్రాక్`తో మాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. లాక్డౌన్ తర్వాత విడుదలై మంచి విజయం సాధించడంతో సామన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపాడు. ``క్రాక్` సినిమాను బాగా ఎంజాయ్ చేశా. నా అభిమాన రవితేజగారు టాప్ ఫామ్‌లో ఉన్నారు. శ్రుతీహాసన్ తన బెస్ట్ ఇచ్చింది. సముద్రఖని, వరలక్ష్మి చక్కగా నటించారు. ఇక, తమన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి చేర్చింది. డైరెక్టర్ గోపీచంద్ వర్క్ టాప్ లెవెల్లో ఉంద`ని చెర్రీ ట్వీట్ చేశాడు.