Mumbai: నారాయణ్ రాణేను కలిసిన రాందాస్ అథవాలే

ABN , First Publish Date - 2021-08-26T14:58:30+05:30 IST

బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామదాస్ అథవాలే కలిశారు...

Mumbai: నారాయణ్ రాణేను కలిసిన రాందాస్ అథవాలే

ముంబై (మహారాష్ట్ర): బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామదాస్ అథవాలే కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రామదాస్ అథవాలే భేటీ అయ్యారు.‘‘నేను కేంద్ర కేబినెట్ మంత్రి నారాయణ్ రాణేను కలిశాను... ఆయనకు ప్రజల మద్దతు ఉందని చెప్పాను’’ అని రాందాస్ అథవాలే ట్వీట్ చేశారు.


రాయగఢ్ జిల్లాలోని మహాద్‌ మెజిస్ట్రేట్ కోర్టు తర్వాత కేంద్ర మంత్రికి బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 13 న విచారణ కోసం రత్నగిరి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు మంత్రి నారాయణ్ రాణేను ఆదేశించింది.తాను ఎవరికీ భయపడనని, పోలీసులు అరెస్టు చేసిన తర్వాత తనకు మద్దతుగా నిలిచినందుకు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి రాణే బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-08-26T14:58:30+05:30 IST