సచిన్‌లా కాకున్నా...ద్రావిడ్‌ సామాన్యుడు కాదు

ABN , First Publish Date - 2020-08-07T09:44:06+05:30 IST

సచిన్‌లాంటి గొప్ప క్రికెటర్‌ జట్టులో ఉన్న రోజుల్లో గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేయగల దిట్టగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న

సచిన్‌లా కాకున్నా...ద్రావిడ్‌ సామాన్యుడు కాదు

రమీజ్‌ రాజా

న్యూఢిల్లీ: సచిన్‌లాంటి గొప్ప క్రికెటర్‌ జట్టులో ఉన్న రోజుల్లో గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేయగల దిట్టగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న ఆటగాడంటూ ద్రావిడ్‌ను కీర్తించాడు పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా. కానీ టెండూల్కర్‌లా ద్రావిడ్‌ అసాధారణ క్రికెటర్‌ కాదని అభిప్రాయపడ్డాడు. ‘ద్రావిడ్‌..సచిన్‌ అంతటి అద్భుత ప్రతిభావంతుడు కాకపోవచ్చు. కానీ ఓ గొప్ప క్రికెటర్‌తో పోటీపడి ద్రావిడ్‌ తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. కొన్ని సమయాల్లో టెండూల్కర్‌ను మించి ద్రావిడ్‌ ఆడిన విషయాన్ని గుర్తించాలి’ అని రమీజ్‌రాజా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-08-07T09:44:06+05:30 IST