పోలీసుల ముందుకు రమేశ్‌ ఆస్పత్రి ఎండీ

ABN , First Publish Date - 2020-12-01T09:35:43+05:30 IST

విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి రమేశ్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు

పోలీసుల ముందుకు రమేశ్‌ ఆస్పత్రి ఎండీ

ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ 


విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి రమేశ్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రమేశ్‌బాబును విచారించడానికి హైకోర్టు మూడు రోజులపాటు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 9న సంభవించిన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఘటన అనంతరం రమేశ్‌ ఆస్పత్రికి చెందిన కొడాలి రాజగోపాలరావుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి ఎండీ రమేశ్‌బాబును అదనపు ఉపకమిషనర్‌-2 లక్ష్మీపతి సోమవారం విచారించారు. రమేశ్‌తో పాటు ఆయన తరపున న్యాయవాది సోము కృష్ణమూర్తిని అనుమతించారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగింది. ఆస్పత్రి నిర్వహణ, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు సంబంధించి మాత్రమే అధికారులు తొలిరోజు విచారించినట్టు సమాచారం.

Updated Date - 2020-12-01T09:35:43+05:30 IST