Abn logo
May 4 2021 @ 17:36PM

JEE Main May Session వాయిదా

న్యూఢిల్లీ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)  మెయిన్, 2021 మే సెషన్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత, రక్షణలను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు వివరించారు. తదుపరి వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని విద్యార్థులను కోరారు.  ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ను ఆయన షేర్ చేశారు.  


ఈ పరీక్షలను మే 24 నుంచి మే 28 వరకు నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జేఈఈ (మెయిన్) 2021 మే సెషన్‌ను కూడా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఈ నోటిఫికేషన్ పేర్కొంది. జేఈఈ మెయిన్ ఎగ్జామినేసన్స్‌ను ఈ ఏడాది నాలుగు దశల్లో నిర్వహించవలసి ఉంది. ఇప్పటి వరకు (పిబ్రవరి, మార్చి నెలల్లో) రెండు దశలు పూర్తయ్యాయి. ఫస్ట్ సెషన్‌లో 6,20,978 మంది విద్యార్థులు హాజరయ్యారని, రెండో సెషన్‌లో 5,56,248 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్షలకు సిద్ధమవడం కోసం ఎన్‌టీఏ అభియాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.


Advertisement
Advertisement
Advertisement