Rameshwaramలో వెనక్కి వెళ్లిన సముద్రం

ABN , First Publish Date - 2022-05-30T14:46:49+05:30 IST

సుప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన రామేశ్వరంలో ఆదివారం సముద్రం వెనక్కి వెళ్లడంతో భక్తులు, పర్యాటకులు తీవ్ర దిగ్ర్భాంతికి

Rameshwaramలో వెనక్కి వెళ్లిన సముద్రం

చెన్నై/పెరంబూర్‌: సుప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన రామేశ్వరంలో ఆదివారం సముద్రం వెనక్కి వెళ్లడంతో భక్తులు, పర్యాటకులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆదివారం సెలవు, సోమవారం అమావాస్య కావడంతో దేశ, విదేశాలకు చెందిన భక్తులు, పర్యాటకు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ ప్రాంతంలోని సముద్రతీరంలో కొద్దిరోజులుగా గాలులు వీస్తుండడంతో అలలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం హఠాత్తుగా సముద్రం సుమారు వందడుగుల వెనక్కు వెళ్లడంతో పాచిపట్టిన బండరాళ్లు బయల్పడ్డాయి. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో  సముద్రం వెనక్కి వెళ్లడం సహజమేనని స్థానిక జాలర్లు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత సముద్రతీర ప్రాంతం యథాతధస్థితికి చేరుకుంది. 

Updated Date - 2022-05-30T14:46:49+05:30 IST