Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా రమీజ్ రాజా!

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం (రేపు) జరగనున్న బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన ఎహసాన్ మణి మూడేళ్ల పదవీ కాలం ఆగస్టు 25తో పూర్తికావడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు.


పీసీబీ ఎలక్షన్ కమిషనర్ జస్టిస్ (రిటైర్డ్) షేక్ అజ్మత్ సయీద్ ఎలక్షన్ నిర్వహిస్తారు. అలాగే,  ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. బోర్డులో పార్టన్-ఇన్-చీఫ్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా బోర్డ్ ఆఫ్ గవర్నర్ కొత్త సభ్యుల కోసం రమీజ్ రాజా, సీనియర్ బ్యూరోక్రాట్ అసద్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించారు. కాగా, పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా ఎన్నిక దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు. సమావేశం ముగిసిన వెంటనే కొత్త చైర్మన్ మీడియాతో మాట్లాడతారని పీసీబీ పేర్కొంది.  

Advertisement
Advertisement