రాస్‌ అల్‌ఖైమాలో రామ్‌కీ ఎన్విరో యూనిట్‌

ABN , First Publish Date - 2022-01-18T13:00:39+05:30 IST

రాస్‌అల్‌ఖైమా ఎమిరేట్‌లో రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌కు నూరు శాతం అనుబంధ సంస్థయిన రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఇండస్ట్రియల్‌ హజార్డియస్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

రాస్‌ అల్‌ఖైమాలో రామ్‌కీ ఎన్విరో యూనిట్‌

హైదరాబాద్‌: రాస్‌అల్‌ఖైమా ఎమిరేట్‌లో రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌కు నూరు శాతం అనుబంధ సంస్థయిన రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఇండస్ట్రియల్‌ హజార్డియస్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాస్‌ అల్‌ఖైమా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామ్‌కీ ఎన్విరో వెల్లడించింది. ఎల్‌ఓఐపై సంతకాలు చేసినట్లు తెలిపింది. ఉత్తర ఎమిరేట్స్‌లో ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కలిగిన ఏకైక వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సదుపాయం ఇదే అవుతుందని రామ్‌కీ ఎన్విరో అధిపతి (మధ్యప్రాచ్య, ఆఫ్రికా వ్యాపారం) రాహుల్‌ దువా తెలిపారు.

Updated Date - 2022-01-18T13:00:39+05:30 IST