Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఒక్క పోరాటం అయినా చేసిందా?: రామ్మోహన్‌నాయుడు

న్యూఢిల్లీ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటం అయినా చేసిందా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా పోరాడుతున్నారని, ఏపీ సమస్యలను వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement