Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వం మదిలో ఏదయినా కుట్ర ఉందా? అనుమానం కలుగుతోంది: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: వికేంద్రీకరణ బిల్లు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మదిలో ఏదయినా కుట్ర ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. అమరావతి రాజధానిపై టీడీపీ మొదటినుంచి గట్టిగా పోరాడుతోందన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని, సీఎం జగన్ స్వయంగా రాజధానిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మరో నాటకానికి తెరలేపుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకు టీడీపీ పోరాడుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement