రాములవీడుని వీడని సమస్యలు

ABN , First Publish Date - 2021-03-03T05:23:21+05:30 IST

మండలంలోని ఆముదాల పల్లి పంచాయతీ పరిధిలోని రాములవీడు గ్రామాన్ని స మస్యలు వీడటం లేదు.

రాములవీడుని వీడని సమస్యలు
పూర్తికాని తారు రోడ్డు నిర్మాణం


నియోజకవర్గ, జిల్లా స్థాయి 

నాయకులు ఉన్నా అభివృద్ధి ఎండమావే

ఇబ్బందులు పడుతున్న స్థానికులు

పొదిలి రూరల్‌, మార్చి 2 :  మండలంలోని ఆముదాల పల్లి పంచాయతీ పరిధిలోని రాములవీడు గ్రామాన్ని స మస్యలు వీడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ తల రాతలు మారడం లేదని గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. మండల కేంద్రానికి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి కోట్లాది రూపా యలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున నాలుగు వైపుల రహదా రులు నిర్మాణం చేసినా గ్రామంలో మ్రాతం పరిస్ధితి దయ నీయంగా ఉంది. దశాబ్ధాలుగా ఈ గ్రామంలో కనీసవసతు లు రహదారులు, మంచినీటి వసతి, మురుగునీటి కాలువల నిర్మాణానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఈ గ్రామం నుండి టిడిపి, వైసిపిల నుండి నియో జకవర్గ, జిల్లా స్థాయి నాయకులతో నేరుగా సంబంధాలు ఉ న్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నా రు. బూచేపల్లి సుబ్బారెడ్డి హయాంలో ఈ గ్రామానికి దా సళ్లపల్లి మీదుగా తారు రోడ్డు నిర్మాణం మంజూరైంది. దాని ని అప్పటి నాయకులు ఇతర ప్రాంతాలకు మార్చి పక్క దారి పట్టించారు. నేడు మరోసారి ఈ మార్గం మంజూరైనా పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉంది, నిమ్మవరం మీ దుగా మండల కేంద్రానికి తారు రోడ్డు నిర్మాణం కొంత పూ ర్తయింది. సుమారు రూ.5కోటలో పనులు జరుగుతున్నా గ్రామంలో మాత్రం ఏలాంటి అభివృద్ది కార్యక్రమాల ప రిస్థితి  అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అంతర్గత రహ దారులు లేవు. సమీపంలో ముసి వాగు ఉన్నా మంచినీటి వసతికి నోచుకోలేదు. నిత్యం ట్యాంకర్లపె ౖఆధారపడి ప్ర జలు ఎదురు చూపులు చూస్తున్నారు. గతంలో ట్యాంకు ని ర్మించారు గాని నిరుపయోగంగా ఉంది.  మురుగు విషయానికి వస్తే  గ్రామం మొత్తం మట్టిరోడ్లు గుంతల మ యం ఇళ్లల్లో మురుగు నీరు ఎటూవెళ్లే పరిస్థితి లేక ఎక్కడ మురుగు నీరు అక్కడే నిల్వ ఉండి కంపుకొడుతోంది.  దానివలన విష జ్వరాలు వస్తాయని భయంగా ఉందని గ్రా మస్థులు అంటున్నారు. స్థానిక నాయకులు, అధికారులు స మస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని ప్రజలు అస హనం వ్యక్తం చేస్తున్నారు.  రాములవీడులో మాత్రం అభి వృద్ధి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోని రాములవీడులో మౌలిక వసతులు కల్పించి, ప్రజల సమస్యలు పరిష్కరించేలా అధికారులు, నాయకులు చర్యలు తీ సుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




Updated Date - 2021-03-03T05:23:21+05:30 IST