Abn logo
Apr 8 2020 @ 20:00PM

నితిన్ చిత్రంలో విల‌న్‌గా...?

సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ‘బాహుబ‌లి’ పెద్ద బ్రేక్‌ను తీసుకొచ్చింది. క్యారెక్ట‌ర్ న‌టిగా ఆమెను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లిన చిత్ర‌మిది. అప్ప‌టి నుండి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తున్న ర‌మ్య‌కృష్ణ త్వ‌ర‌లోనే విల‌న్‌గా మెప్పించ‌నుంద‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన ‘అంధాదున్’ సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను హీరో నితిన్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నితినే హీరోగా న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌ర‌గుతున్నాయి. హిందీలో ట‌బు పోషించిన నెగ‌టివ్ పాత్ర‌లో తెలుగులో ఎవ‌రు చేస్తారా? అనే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. ట‌బు, అన‌సూయ వంటి వారి పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి కూడా. కానీ తాజా స‌మాచారం మేర‌కు ఈ నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌ను న‌టింప చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే వెయిటింగ్ త‌ప్పేలా లేదు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఉండొచ్చు.

Advertisement
Advertisement
Advertisement